crimeHome Page SliderNational

ఢిల్లీలో విదేశీ మహిళపై అఘాయిత్యం..

Share with

ఢిల్లీలోని ఒక హోటల్‌లో విదేశీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. సోషల్ మీడియాలో పరిచయమైన బ్రిటిష్ పర్యాటకురాలిపై వశీం అనే స్నేహితునితో కలిసి హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు కైలాష్. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి, ఈ విషయాన్ని బ్రిటిష్ హై కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. భారత్‌లోని మహారాష్ట్ర, గోవా చూడడానికి హాలిడే కోసం వచ్చినట్లు సమాచారం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పరిచయం సందర్భంగా కైలాష్‌ను ముంబయికి రావాలని కోరగా, అంతదూరం రాలేనని ఆమెను ఢిల్లీకి రమ్మని కోరాడు. ఢిల్లీకి వచ్చిన ఆమెను హోటల్ రూమ్‌లో స్నేహితునితో కలిసి అత్యాచారం చేశాడు. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.