హార్దిక్ పాండ్య ‘ఒంటరి’ పోరాటం !
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఏం చేసినా సంచలనమే! తాజాగా హార్దిక్ ప్రవర్తన క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు మ్యాచ్‌లుగా ‘గాయం’ కారణంగా బెంచ్‌కే పరిమితమైన పాండ్య, నెట్స్‌లో ఒంటరిగా తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. జట్టుతో సంబంధం లేకుండా హార్దిక్ ఒక్కడే ప్రాక్టీస్ చేస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. పాండ్య గాయపడ్డాడని కోచ్ మహేల జయవర్ధనే చెబుతుంటే, నెట్స్‌లో అతడి ప్రాక్టీస్ చూస్తుంటే అది నిజమేనా? అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది. సహచర ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపుతుండటంతో, హార్దిక్ జట్టులో ఒంటరి అయ్యాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘గర్ల్‌ఫ్రెండ్’ వ్యవహారంలో హార్దిక్ పేరు వినిపించడం, మైదానంలో స్నేహితురాళ్లకు అనుమతి లేదని బీసీసీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం అతడిని కలవరపెట్టి ఉండవచ్చు. వచ్చే సీజన్‌లో హార్దిక్‌ను తప్పించి సూర్యకుమార్ లేదా బుమ్రాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

