బాద్‌షా మూవీలో బ్రహ్మానందంలా BRS నేతలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఇవాళ సభ్యులు చర్చిస్తున్నారు. సమావేశంలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సభలో చమత్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలను ‘బాద్‌షా’ సినిమాలోని బ్రహ్మానందం క్యారెక్టర్ లా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో బ్రహ్మానందం ఊహాలోకంలో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని BRS నేతలు వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోం అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.