చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్య, మూడు నెలల వైద్యం అవసరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో లోపాలు ఉన్నాయని తేల్చారు. ఈ కారణంగా విశ్రాంతి అవసరం అని సిఫార్సు చేశారు. గుండె పరిమాణం పెరిగినందున నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పారని ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు సమర్పించారు. గుండె సంబంధిత ఇబ్బందులతో పాటు చర్మవ్యాధి అధికంగా ఉందని మూడు నెలల పాటు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వివరించారు. గుండె పరిమాణం పెరిగిందని వైద్యుల సిఫారసు చేశారని ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం కోర్టు ముందు ఉంచారు. నిత్యం మందులు వాడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన బెయిల్ పిటిషన్ పై చిక్కుముడలు వీడడం లేదు.

అనారోగ్య కారణాల రీత్యా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ప్రధాన వాజ్యం విచారణ కొలిక్కి రావటం లేదు. దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ ఇస్తే కేసు మొత్తాన్ని ప్రభావితం చేయగలరని ప్రభుత్వ వాదన. చంద్రబాబు తరపు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ లోను తమ వాదనలు వినిపించారని ప్రధాన బెయిల్ పిటిషన్ పై ఇంకా స్పందించలేదని సిఐడి తరపు అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టుకు నివేధించారు. న్యాయవాదులు వాదనలు వినిపించినట్లు చెబుతున్న నేపథ్యంలో వివరాలను రికార్డు చేయాలని కోరారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. గురువారం బెయిల్ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయవాద వర్గాల సమాచారం.

