పుష్ప – 2 బెనిఫిట్ షో టికెట్స్ కావాలా?
పాన్ ఇండియా తెలుగు ఆరిజిన్ మూవీ పుష్ప 2 బెన్ ఫిట్ షోకి టికెట్స్ కావాల్సిన వాళ్లు ఆయా సినిమా ప్రదర్శిత థియేటర్ల వద్ద డిసెంబర్ 4 సాయంత్రం 6గంటల నుంచి కొనుగోలుచేసుకోవచ్చు.సాధారణంగా ఆన్ లైన్‌లో టికెట్లు లభ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ…బెనిఫిట్ షో టికెట్స్ మాత్రం ధియేటర్ల వద్దే తీసుకోవచ్చని చెప్పారు. ఎందుకంటే అమెరికాతో పాటు ఇండియాలోనూ డిసెంబర్ 4 రాత్రి 9.30గంటలకే సినిమాను ప్రదర్శించబోతున్నారు.దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతిచ్చింది.అంతేకాదు టికెట్ల పెంపుకూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బెనిఫిట్ షోని రూ.800లు ధరగా నిర్ణయించారు.ఇది ఆల్ టైం రికార్డుగా చెప్పొచ్చు.ఒక రోజు ముందుగా ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ఇంత ధర పలకడం ఇదే తొలిసారి.ఇదిలా ఉండగా బెనిఫిట్ షోని డిసెంబర్ 4 అర్ధరాత్రి ఒంటిగంటకు (తెల్లవారితే డిసెంబర్ 5) తెలంగాణా అంతటా ప్రదర్శించబోతున్నారు. మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ రూ. 354 ,మల్టీప్లెక్స్ రూ. 531,బెనిఫిట్ షో టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్ రూ.1121, మల్టీప్లెక్స్ రూ.1239లుగా ధర నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.