Home Page SliderNationalNewsPolitics

మోదీ హైదరాబాద్ పర్యటనపై రాహుల్ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ మే 10, 2026న హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ పర్యటనలో పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం) సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీనిపై రాహుల్ గాంధీ ఎక్స్ (X) వేదికగా.. “నిన్న మోదీ గారు ప్రజలను త్యాగాలు చేయమని కోరారు – బంగారం కొనకండి, విదేశాలకు వెళ్లకండి, పెట్రోల్ తక్కువ వాడండి, ఎరువులు,వంట నూనె వినియోగాన్ని తగ్గించండి, మెట్రోలో ప్రయాణించండి,వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఇవి కేవలం సలహాలు మాత్రమే కాదు, ప్రభుత్వ వైఫల్యానికి నిరూపణలు” అని మండిపడ్డారు.

గత 12 ఏళ్లలో దేశాన్ని ఇలాంటి స్థితికి తీసుకువచ్చారని, ఇప్పుడు ప్రజలు ఏం కొనాలి, ఎక్కడికి వెళ్లాలి అనేవి కూడా ప్రభుత్వం నిర్దేశించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి, ప్రతిసారీ సామాన్య ప్రజలపైనే భారాన్ని మరియు బాధ్యతను నెడుతోందని రాహుల్ విమర్శించారు.

ఈ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి “రాజీపడిన ప్రధాని, ఇకపై దేశాన్ని నడిపించడానికి తగరు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.