‘మా కాలేజీకి పేరు లేదా?’..విద్యార్థినుల ఆందోళన
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినులు భారీ ఆందోళనలు చేపట్టారు. తమ కాలేజీకి సరైన పేరు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో తమ కాలేజీకి తెలంగాణ మహిళా వర్సిటీ అనీ, ఇటీవల రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ వర్సిటీ అని మార్చడంతో సందిగ్థత నెలకొందని వారి వాదన. క్షేత్ర స్థాయిలో ఎలాంటి జీవోలు లేవని, తమకు గుర్తింపు లేదని మండిపడుతున్నారు. తమ కాలేజీకి యూజీసీ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.