Home Page SliderInternational

భారత్‌కే మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటం

Share with

ఈ ఏడాది మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటం భారత్‌కే దక్కింది. ఒడిశాలోని భువనేశ్వర్ కేఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్న తృష్ణ  మిస్ టీన్ యూనివర్స్‌గా ఎన్నికయ్యింది. దక్షిణాఫ్రికాలోని క్లింబరీలో ఈ పోటీలు జరిగాయి. దీనిలో పలు దేశాలకు చెందిన టీనేజ్ మోడల్స్ పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కినెట్టి మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని 19 ఏళ్ల తృష్ణా రే గెలుచుకున్నారు. ఆమె తండ్రి దిలీప్ కుమార్ రే భారత ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తున్నారు. ఆమె చదువుతున్న కేఐఐటీ వ్యవస్థాపకురాలు డా. అచ్యుత సమంత ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను పోస్టు చేశారు.