Home Page SliderNational

ఫెంగల్ తుఫాన్.. చెన్నై ఎయిర్ పోర్టు మూసివేత

Share with

ఫెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా చెన్నయ్ ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి బయల్దేరే నాలుగు ఫ్లయిట్లను రద్దు చేశారు. అధి కారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.