తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత
తిరుమల శ్రీవారిని ఈ రోజు తెల్లవారుజామున బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను స్వామివారి సేవలో పనిచేసేలా టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అన్యమత ఉద్యోగస్థులపై టీటీడీ వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ సమగ్రమైన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.