NewsTelangana

ఏప్రిల్‌ లేదా మేలో గ్రూప్‌-4 పరీక్ష

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. 9,168 పోస్టులతో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ గురువారం విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ప్రకటించారు. గ్రూప్‌-4లో ముఖ్యంగా 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మునిసిపల్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859 ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 742, బీసీ వెల్ఫేర్‌ శాఖలో 307, హోం శాఖలో 133, పంచాయతీ రాజ్‌ శాఖలో 1245, రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు భర్తీ చేయనున్నారు. వివరాలకు tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని అనితా రామచంద్రన్‌ చెప్పారు.