Home Page SliderNews AlertTelanganaWeather

ఎల్‌నినోతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు

ఎల్‌నినో ప్రభావంతో వచ్చే నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2026 జూన్‌ నుంచి 2027 జనవరి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన నెలకొంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముండటంతో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చవచ్చని అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్, నాగార్జునసాగర్ డ్యామ్‌తో సహా పలు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ఈ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు.ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఇంజనీర్లు సూచిస్తున్నారు. రాబోయే కృష్ణా బోర్డు సమావేశంలో ఈ అంశంపై కీలకంగా చర్చించాలని అధికారులు భావిస్తున్నారు.