Home Page SliderTelangana

భూ వివాద నేపథ్యంలో వ్యక్తిపై గ్రామస్తుల దాడి

Share with

నల్గొండ జిల్లాలో కేతేపల్లి మండలం కొండక్రిందిగూడెంలో భూ వివాద నేపథ్యంలో కొట్ల లింగయ్య అనే వ్యక్తిపై గ్రామస్తులు కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. ఒకే కులానికి చెందినటువంటి తాతల కాలం నుండి వదిలపెట్టిన భూమిలో పంటలు సాగు చేసుకుంటుండగా అదే కులం వారు ఈ భూమిలో మా తాతలు కూడా భాగస్వాములని రిజిస్ట్రేషన్‌లో మేము కూడా వాటాదారులమని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామస్తులు చేసిన దాడికి బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.