Home Page SliderNewsSportsviral

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ సర్‌ప్రైజ్…

Share with

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ టీమ్ సర్వం సిద్ధమయ్యింది. వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అయితే మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకే కాకుండా, అభిమానులకు కూడా సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ జట్టుకు బాలీవుడ్ కలర్ తీసుకొచ్చింది. సీనియర్ స్టార్ హీరో జాకీష్రాఫ్‌ను స్పిరిట్ కోచ్‌గా నియమించింది. జగ్గూ దాదా అంటూ దీనికి సంబంధించిన వీడియోను ముంబయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదలను పెంచడానికి ముంబయి ఫ్రాంచైజీ ఈ వినూత్న ఆలోచనలు చేసింది. అయితే ఈ సీజన్‌కు స్టార్ పేసర్ బుమ్రా కొన్ని రోజులు దూరం కానున్నారు. వెన్ను గాయంతో బాధపడుతూ, బెంగళూరులోని సెంటర్ ఆప్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. మరో 4 వారాల పాటు ముంబయి టీమ్‌లో చేరకపోవచ్చని సమాచారం. కెప్టెన్ హార్థిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ టీమ్‌లో ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈసారైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉన్నారు.