Home Page SliderTelangana

సికింద్రాబాద్ ఎంపీగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

Share with

సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఏటా తన పనితీరుపై ప్రజలకు నివేదిక ఇచ్చానన్నారు కిషన్ రెడ్డి. నాడు ఎమ్మెల్యేగా, నేడు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ నియోజకవర్గ, తెలంగాణకు ప్రజలకు ఏం పనులు చేశానో నివేదిక ఇచ్చానన్నారు. హోంశాఖ సహాయ, పర్యాటక,సాంస్కృతిక మంత్రిగా, కేంద్ర పాలిత ప్రాంతాల ఇన్‌చార్జీగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించానన్నారు. జీ20 సమావేశాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నా చేతుల మీదుగా నిర్వహించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఏ రోజు కూడా నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలను తలదించుకునే పనులు చేయలేదన్నారు. అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం సమర్థవంతంగా పని చేయడం జరిగిందన్నారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో పని చేయడం జరిగిందన్నారు. పదేండ్లలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టామన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్​మెంట్ కోసం రూ.719 కోట్లు చేశామన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్న ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రజలందరి సంక్షేమానికి కృషి చేశానన్నారు. సికింద్రాబాద్ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశానన్న ఆయన, తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గెలిచిన తర్వాత 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతులకు,యువకులకు,మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదన్న ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనన్నారు. మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమేనని, తెలంగాణను అభివృద్ది చేసేది మోదీయేనని, తెలంగాణలో 17కు 17 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.