HealthNews

మధ్యాహ్నం పూట నిద్రపోయే వారు ఇవి తెలుసుకోండి…

Share with

చాలామంది అలసట వల్లనో లేదా అలవాటు ఉండడం వల్లనో మధ్యాహ్నం పూట నిద్రపోతుంటారు. అలా చెయ్యడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లాభాల సంగతి చూసుకుంటే

మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మెదడు రిఫ్రెష్ అయ్యి చురుకుగా పనిచేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు, అలసటను తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం పూట ఒక గంట అలా నిద్రపోవడం వల్ల రక్తపోటు తగ్గి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గించుకోవచు.

నష్టాలు సంగతి చూసుకుంటే

మధ్యాహ్నం అతిగా నిద్రపోవడం వలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండక మధుమేహ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి సమయంలో నిద్ర పట్టదు, జీర్ణ ప్రక్రియ మందగించడం వల్ల మల బద్దకం వచ్చే ప్రమాదం ఎక్కువ.