News

హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన స్వామిపరిపూర్ణానంద

Share with

బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీపీఠం నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద హిందూపురం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాస్తవానికి కూటమి అభ్యర్థిగా హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావించారు. బీజేపీ ముఖ్యుడిగా ఉన్న ఆయనకు దాదాపు సీటు ఖరారవుతుందనుకున్న తరుణంలో ఆయనకు టికెట్ రాలేదు. గత కొంత కాలంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఆయన హిందుత్వ సిద్ధాంతాలను, విధానాలను యువతకు వివరిస్తూ, దేశానికి హిందూపురం నియోజకవర్గ ఆవశ్యకతను వివరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పక్షాన పోటీ చేసి మోదీకి మద్దతుగా నిలవాలని ఆయన భావించారు. అయితే ఆయనకు పార్టీ టికెట్ ఖరారు చేయలేదు. ఆర్ఎస్ఎస్ మద్దతున్నప్పటికీ ఆయనకు పార్టీలో కొందరు టికెట్ రాకుండా చేశారన్న ప్రచారం ఉంది. ఇవాళ ఉదయం నామినేషన్ వేసే ముందు ధర్మ ప్రభువు శ్రీరామచంద్రునికి, ధర్మ రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు.