సునీతా విలియమ్స్‌కు మరోసారి నిరాశే..
అంతరిక్ష కేంద్రంలో గత 10 నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు తిరిగి రావడానికి ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. నేడు జరగాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ10 రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినట్లు నాసా తెలిపింది. దీనితో వారికి మరోసారి నిరాశ ఎదురయ్యింది. కేవలం 9 రోజుల కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వీరిద్దరూ అనివార్య కారణాల వల్ల అక్కడే ఉండిపోవలసి వచ్చింది. నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ నేడు క్రూ 10 ద్వారా ఫ్లోరిడా నుండి బయలుదేరవలసి ఉంది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో దీనిని ఆపివేసినట్లు నాసా పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించి ఈ వారంలోనే మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. వారిద్దరినీ తీసుకురావడానికి మరో నలుగురిని అక్కడికి పంపుతున్నారు. కొత్తగా వచ్చే వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. వారు కూడా 150 రోజులు అంతరిక్షకేంద్రంలో ఉండాల్సి వస్తుంది.