శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సాధించారు. తాజాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యారు. గత నెలలో గిల్ చేసిన అత్యుత్తమ ప్రదర్శనకు ఈ అవార్డు వచ్చింది. గత నెలలో 5 వన్డేలు ఆడిన గిల్ 94.19 యావరేజ్, 101.50 స్టైక్ రేట్‌తో 406 పరుగులు తీశారు. ఈ స్కోర్‌లో ఒక సెంచరీ సహా మూడు వరుస ఫిఫ్టీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిఫ్స్ వంటి గట్టి పోటీదారులను వెనక్కి నెట్టి, ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.