Home Page SlidermoviesNews AlertTelangana

బాలయ్య రొమాన్స్

కుర్రాళ్లను మించిన వేగంతో 66 ఏళ్ల వయసులో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. త్వరలో సీనియర్ బ్యూటీ ప్రియమణితో సినిమా చేయబోతున్నారు. ‘అఖండ 2’ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోపీచంద్ మలినేనితో సినిమాను పట్టాలెక్కించిన ఆయన.. ఈ మూవీ చేస్తూనే దానితో సమాంతరంగా మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సీనియర్ దర్శకుల కంటే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు సీనియర్లు, జూనియర్లు క్యూకడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ కొరటల శివతో మూవీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ మూవీ క్యాస్టింగ్ కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే.. కొరటాల కథ నచ్చడం దానికి బాలయ్య ఓకే చెప్పడమే కాదు.. ఏకంగా మే 1న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు హీరోయిన్‌గా సీనియర్ నటి ప్రియమణిని కన్ఫర్మ్ చేసినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. గతంలో 2009లో బాలయ్య- ప్రియమణి జంటగా ‘మిత్రుడు’ అనే సినిమాలో నటించారు. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి జోడీ కట్టనుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు పెట్టింది పేరైన బాలయ్యతో కొరటాల మార్క్ టేకింగ్ తోడైతే రికార్డులు గల్లంతేనని సినీ జనాలు చెబుతున్నారు. నిజానికి ఎన్టీఆర్‌తో దేవర 2ను తెరకెక్కించాలని కొరటాల వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో ఈ గ్యాప్‌లో బాలయ్య కోసం పవర్‌ఫుల్ కథ రాసుకున్నారట కొరటాల. 2027 సంక్రాంతి నాటికి ఈ సినిమాను పూర్తి చేయాలని కొరటాల కూడా పట్టుదలతో ఉన్నారట.