నాగార్జున పరువు నష్టం కేసు విచారణ వాయిదా
మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ నవంబర్ 13కు వాయిదా పడింది. మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో విచారణను ఇన్చార్జి న్యాయమూర్తి వాయిదా వేశారు. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. హీరో నాగార్జున వేసిన పిటిషన్లపై ఇప్పటికే మంత్రికి కోర్టు సమన్లు జారీ చేసింది. సమన్లకు ఈ రోజు కోర్టులో సురేఖ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో నాగార్జునతోపాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్ల స్టేట్మెంట్లను న్యాయస్థానం రికార్డు చేసింది.