దీపావళికి ఇవి కొంటే మీ పంట పండినట్లే..
దీపావళి నాడు బంగారం, వెండి, వస్తువులు కొనాలని అందరూ అనుకుంటారు. ఇవి కొంటే మంచిదని, అదృష్టమని నమ్ముతారు. కానీ ఖరీదైన ఆభరణాలే కొనలేని వారు మంగళప్రదమైన ఈ వస్తువులు కొంటే కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తుంటారు.
పసుపు, కుంకుమలు కొని ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది. పసుపు, పసుపు కొమ్ములు కొని, పూజలో ఉంచి పూజ చేస్తే మనం చేసే వ్యాపారం వృద్ధి చెందుతుంది.
దీపావళి రోజున శంఖం కొని ఇంటికి తీసుకువచ్చి, దానిలో కుంకుమ కలిపిన బియ్యాన్ని వేసి, ఉత్తర దిక్కులో ఉంచితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

ఈ రోజున తమల పాకులను కూడా ఇంటికి తీసుకురావాలి. పూజ చేసి, భగవంతునికి నివేదన చేసి తమలపాకుల తాంబూలం సమర్పించాలి.
లక్ష్మీ, వినాయకుడు, కుబేరుడు, ఆవు దూడ వంటి బొమ్మలు ఇంటికి తీసుకువస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
తామరపువ్వులు, మట్టి ప్రమిదలు వంటివి కూడా కొనుక్కోవచ్చు.