“మోదీ అధీనంలోనే మీడియా, ఈడీ, సీబీఐ”.రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ తన అధీనంలోనే మీడియా, ఈడీ, ఆదాయపన్ను, సీబీఐలను ఉంచుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వయనాడ్‌లో ఉపఎన్నికలో సోదరి ప్రియాంక గాంధీ విజయోత్సవ సభలో ఆమెతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. వయనాడ్ ప్రజలపై మోదీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. వయనాడ్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరగలేదని, అదానీ సంస్థలకు మాత్రం వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలిగిందన్నారు. వయనాడ్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని, పార్లమెంటులో ఇక్కడి సమస్యలు వినిపిస్తానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.