పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..కోట్ల రూపాయల నష్టం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడూరులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పత్తి నిల్వ చేసిన గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తి భారీగా నిల్వ ఉండడంతో మంటలు చాలా సులభంగా వ్యాపించాయి. పరిసర ప్రాంతం అంతా పెద్ద ఎత్తున పొగలు వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. కార్మికులు వెంటనే బయటకు పరుగులు పెట్టడంతో ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. కానీ కోట్ల రూపాయలలో నష్టం ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రమాదంలో గొడౌను పూర్తిగా కుప్పకూలిపోయింది.