భారత్-ఎ జట్టు శ్రీలంక పర్యటన టీమ్
.కెప్టెన్‌గా తిలక్ వర్మ..ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ
భారత్-ఎ జట్టు జూన్ నెలలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు (ట్రై) సిరీస్ కోసం సిద్ధమైంది. భారత సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం బలమైన జట్టును ప్రకటించింది. జూన్ 9 నుంచి ఈ ట్రై సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ ఎ, శ్రీలంక ఎ, ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్లు తలపడతాయి. ఈ సిరీస్ మ్యాచ్‌లన్నీ దంబుల్లాలో జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. 15 ఏళ్ల టీనేజ్ అద్భుతం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్ గా ఈ జట్టులో చోటు దక్కింది. ట్రై సిరీస్ అనంతరం భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు గాలే వేదికగా రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన జట్టును బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది.
భారత్-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.

