వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్
వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన కేసులో ఆయనతో పాటు కొందరు వైసీపీ నాయకులపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా, దానిని హైకోర్టు కొట్టివేసింది. దీనితో సురేశ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ ఎక్కడున్నారో తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్ నిందితులుగా ఉన్నారు. సురేష్ పట్టుబడగా, మిగిలినవారు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.