పోలీసులపై కోల్‌కతా హత్యాచార బాధితురాలి కుటుంబం సంచలన వ్యాఖ్యలు
పోలీసులు తమకు లంచాన్ని ఎరగా వేస్తున్నారని కోల్‌కతా హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబం సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు కేసును పక్కతోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, తమను కేసు వెనక్కి తీసుకోవడానికి లంచం ఇవ్వజూపారని వారు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఈ కేసుపై దేశవ్యాప్తంగా డాక్టర్లు ఇంకా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది.