రిషితేశ్వరి కేసు కొట్టివేసిన కోర్టు
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఏఎన్‌యూ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు శుక్రవారం కొట్టివేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పడిన టిడిపి ప్రభుత్వంలో 2015,జులై 14న ఏఎన్‌య క్యాంపస్‌లో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది.అప్పట్లో దీనికి సంబంధించిన సూసైడ్ లెటర్ కూడా లభ్యం అయ్యింది.ర్యాగింగ్ వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. అప్పటి నుంచి మృతురాలి తల్లిదండ్రులు 9 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే కోర్టు తీర్పుతో రిషితేశ్వరి తల్లిదండ్రులు స్పందించారు.తమకు న్యాయ పోరాటం చేసే ఆర్ధిక స్థితి సన్నగిల్లిందని,ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలన్నారు. లేకపోతే తాము కూడా ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు.