‘వరదలలో సినిమాల గోలేంటి ముఖ్యమంత్రిగారూ’..?
వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే బాధ్యత లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ బాల్క సుమన్. ప్రజలు ఇళ్లు మునిగిపోయి కష్టపడుతుంటే సినిమాలతో ముఖ్యమంత్రి కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వరదలతో, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కానీ రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్టు తన ఇంట్లో “సరిపోదా శనివారం” అనే సినిమా చూసుకుంటూ ఆస్వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలకు ఇదేనా సమయం? ఏం పని లేదా? అంటూ మండిపడ్డారు.