ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డ్ వ్యూస్.. వెల్లడించిన జియో
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లను ప్రపంచ నలుమూలల నుండి రికార్డు స్థాయిలో ప్రజలు వీక్షించారు. గతంలో ఎన్నడూ లేనంత వ్యూస్ వచ్చాయి అని సమాచారం. ముఖ్యంగా భారత్ ఆడిన మ్యాచ్‌లన్నింటికీ పదుల కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. ఇండియా-పాకిస్తాన్, ఇండియా-ఆస్ట్రేలియా, ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్‌లకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత టోర్నీ గెలిచిన ఫైనల్స్ అయితే 90 కోట్లమందికి పైగా వీక్షించారు. మొత్తం టోర్నీకి ఎంతమంది చూశారో జియో వాచ్ టైమ్ రిలీజ్ చేసింది. ఈ మ్యాచ్‌లన్నీ కలిపి భారత్ జనాభా 143 కోట్లు, చైనా జనాభా 141 కోట్లు కలిపిన దానికంటే రెట్టింపు వ్యూస్ వచ్చాయి. మొత్తంగా 540.3 కోట్లు వీక్షణాలు, 11 వేల కోట్ల నిమిషాల వాచ్ టైమ్ నమోదయ్యింది. జియో హాట్ స్టార్ మొదటిసారిగా ఈ ఐసీసీ ఈవెంట్‌ను బ్రాడ్ కాస్టింగ్ చేసింది. 9 ప్రాంతీయ భాషలలో కూడా కామెంటేటరీని వినిపించింది. కేవలం భారత్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ రోజే అత్యధిక సబ్‌స్క్రిప్షన్లను కూడా సాధించామని పేర్కొంది.