విజయశాంతి అక్కడ మాత్రమే పనికొస్తుంది
అలనాటి సౌత్ ఇండియా డాన్స్ క్వీన్ విజయశాంతిని ప్రజలు వెండి తెర మీద మాత్రమే చూస్తారని,అక్కడ మాత్రమే ఆమెను ఆదరిస్తారని,కానీ రాజకీయాల్లో ఆమె దేనికీ పనికిరారంటూ నారయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.విజయశాంతి కనీసం ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేయక ముందే…ఆమెపై సొంత పార్టీలో ఎదురు దాడి ప్రారంభమైంది.ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు.విజయశాంతి కోసం సినిమాలు చూస్తారేమో కానీ ఓట్లు వేయరంటూ హేళన చేశారు.ఎన్నికల సమయంలో విజయశాంతి తన కోసం ప్రచారం చేస్తా అంటే నాకే నెగిటివ్ అవుతుందని వద్దని చెప్పానని గుర్తు చేశారు. ఈ తరహా స్వపక్ష దాడి చేస్తారని తమకు ముందే తెలుసంటూ విజయశాంతి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది.