ఆరా సేవలు అనిర్వచనీయం
ఆరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు నిరుపమానమని త్రికోటేశ్వర గ్రానైట్స్ యజమాని చైతన్య కొనియాడారు.పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని గుండయ్యతోటలో రోషిణి సర్వీసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో…ఆరా ఫౌండేషన్ ఆర్ధిక సౌజన్యంతో నిర్వహించిన హెచ్.ఐ.వి.వ్యాధిగ్రస్థుల వైద్య శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.వ్యాధిగ్రస్థులు తమ తమ జీవన ప్రమాణ కాలాన్ని పెంచుకునేందుకు ఇలాంటి దాతలు ఎంతో మంది ముందుకొచ్చి ఉచితంగా మందులు,కనీస అవసరాలు నెరవేరుస్తున్నారని వారి సేవలను సద్వినియోగం చేసుకుని ఆత్మస్థైర్యంతో జీవించాలని సూచించారు. మరో నిర్వాహకులు వికాస్ మాట్లాడుతూ….సమాజంలో ఆపన్నులకు అండగా ఉండేందుకు ఆరా ఫౌండేషన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు.ఆరా మస్తాన్ సహాయసహకారాలతోనే తామీ వైద్య శిబిరం నిర్వహించిన వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు,పౌష్టికాహారం,భోజన ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఏవి రమణ,అనిత, తదితరులు పాల్గొన్నారు.