మహిళను చంపిన పులి
మహిళపై పెద్దపులి దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగజ్ నగర్‌లోని గన్నారం అటవీ ప్రాంతం సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళపై పెద్దపులి దాడి చేసింది.అటవీ పొదల్లోకి లాక్కెళ్లింది.అటుగా వెళ్తున్న వారు ఈ ఘటనను చూసి పులిని వెంబడించారు.పులిపంజా ధాటికి మహిళ శరీరమంతా ఛిద్రమైంది.తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.విషయాన్ని అటవీ శాఖ సిబ్బందికి తెలియజేయడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.దీంతో గన్నారం గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలోనూ పులి సంచారం గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోవలేదని వాపోతున్నారు.