Home Page SliderNationalNews

పెట్రో భారం: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

దేశవ్యాప్తంగా వాహనదారులకు చమురు సంస్థలు మరోసారి గట్టి షాక్ ఇచ్చాయి. ఈరోజు శనివారం ఉదయం నుంచే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి.

తాజా సవరణ ప్రకారం, దేశీయంగా లీటరు పెట్రోల్‌పై సగటున 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.81 కి చేరగా.. డీజిల్ ధర రూ.100.94 వద్ద రికార్డు స్థాయికి చేరింది.

మెట్రో నగరాల్లో తాజా ధరల పట్టిక :

నగరం పెట్రోల్ లీటరుకు డీజిల్ లీటరుకు
హైదరాబాద్రూ. 112.81రూ. 100.94
ఢిల్లీరూ. 99.51రూ. 92.49
ముంబైరూ. 108.49రూ. 95.02
కోల్‌కతా రూ. 110.64రూ. 97.02
చెన్నై రూ. 105.31రూ. 96.98

వరుసగా పెరుగుతున్న ఈ ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడనుంది. ఫలితంగా రాబోయే రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.