Home Page SlidermoviesNationalNews AlertTrending Todayviral

తమిళనాట విజయ్ ప్రభంజనం..రాజకీయాల్లోకి త్రిష..?

చెన్నై (ఏడీఎన్ఎన్):
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడంతో సరికొత్త రాజకీయ శకం మొదలైంది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ ప్రభంజనం కొనసాగించారు. ఈ విజయోత్సవవేళ.. హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కోలీవుడ్ నుంచి కోట వరకు వైరల్ అవుతున్నాయి. మే 4వ తేదీన త్రిష పుట్టినరోజు కావడం, అదే రోజు ఎన్నికల ఫలితాల్లో విజయ్ ఘనవిజయం సాధించడంతో ఆమెకు ఇది డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. ఫలితాల వెల్లడి సమయంలో త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లడం, అంతకుముందు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. విజయ్ విజయం కోసం ఆమె ప్రత్యేక పూజలు చేశారని, వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు రాజకీయ దిశగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించిన పక్షంలో, ఒక స్థానానికి రాజీనామా చేసి ఆ ఉప ఎన్నికలో త్రిషను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, త్రిష కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా విజయ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను ఎప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని ఆమె సరదాగా అన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆమె రాజకీయ ప్రవేశం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయ్ పొలిటికల్ జర్నీలో త్రిష వెన్నంటి ఉంటూ పార్టీ బలోపేతానికి సహకరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.