ఐపీఎల్ 2026కు టీఆర్పీ సెగ
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్, ఈసారి వ్యూయర్‌షిప్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. సగానికి పైగా టోర్నీ ముగిసినా, గతేడాది స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో ఈ మెగా లీగ్ విఫలమవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. గతంలో 4.57 పాయింట్లుగా ఉన్న రేటింగ్, ఈసారి 3.71 పాయింట్లకు పడిపోయింది. అంటే 18 శాతం పడిపోయింది. సగటు వ్యూయర్‌షిప్‌లో 26 శాతం క్షీణత నమోదైంది. గత సీజన్‌లో 12.40 కోట్ల మంది చూస్తే, ఈసారి అది 11.36 కోట్లకే పరిమితమైంది. అడ్వర్టైజర్ల సంఖ్య 31 శాతం తగ్గింది. గత ఏడాది 65 బ్రాండ్లు ఉండగా, ఈసారి కేవలం 45 బ్రాండ్లు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నాయి. రోజువారీ మ్యాచ్‌లు టోర్నీ కాల పరిమితి పెరగడం వల్ల ప్రేక్షకులలో ఉత్సాహం తగ్గుతోందని సమాచారం. కేవలం బ్యాటర్లకే అనుకూలించే పిచ్‌లపై భారీ స్కోర్లు నమోదవుతున్నా, బౌలింగ్ లో థ్రిల్ లేకపోవడం ఆటను ఏకపక్షంగా మారుస్తోంది. పలు రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్‌పై నిషేధం విధించడంతో, యువతలో ఈ టోర్నీపై ఉన్న ఆసక్తి కొంత మేర తగ్గింది. ప్రేక్షకులు కేవలం తమకు ఇష్టమైన జట్ల మ్యాచ్‌లను మాత్రమే చూస్తూ, మిగిలిన మ్యాచులను స్కిప్ చేస్తున్నారు. ఐపీఎల్ తన పూర్వ వైభవాన్ని కాపాడుకోవాలంటే కేవలం రన్ల వరద పారించడం మాత్రమే సరిపోదని, ఆటలో ఉత్కంఠను పెంచేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

