రైలు హైజాక్.. వెలుగులోకి సంచలన విషయాలు
పాకిస్థాన్‌లో నిన్న హైజాక్‌కు గురయిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రక్షణ కోసం ప్రయత్నిస్తున్న పాక్ భద్రతా దళాలకు సంచలన విషయాలు తెలిసాయి. బెలూచ్ వేర్పాటువాదుల నుండి ఈ రైలును విడిపించి, ప్రయాణికులను రక్షించే ఆపరేషన్ వారికి జటిలంగా మారింది. ఎందుకంటే కొందరు మిలిటెంట్లు ఆత్మాహుతి దళాలుగా తయారయినట్లు సమాచారం. సాధారణ ప్రయాణికుల మధ్యలో ఈ ఆత్మాహుతి దళాలు కూర్చుని, వారిని తమ మానవకవచాలుగా మార్చుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరడానికి 48 గంటల సమయం ఇచ్చారు. రైలు పట్టాలను పేల్చేసిన వారు, వైమానిక దాడులు ఆపకపోతే బందీల ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. బందీలలో కొందరిని మిలిటెంట్లు సమీప పర్వతాలలోకి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సూత్రదారులలో ఒకరు ఆఫ్గానిస్తాన్‌లో ఉన్నారని, వారు తమ బాస్‌లతో మాట్లాడడానికి సెల్‌ఫోన్లు వాడుతున్నారని సైన్యం వెల్లడించింది. ఈ రైలు ప్రయాణ మార్గం పర్వతాల మధ్య నుండి వెళ్లడం, 17 టన్నెళ్లు ఉండడంతో తక్కువ స్పీడ్‌తో రైలు వెళ్లడం దాడికి అనుకూల ప్రదేశంగా మారింది.