ఏపీకి తప్పని ముప్పు
ఏపీకి ఇంకా భారీ వర్షాల ముప్పు తగ్గలేదు. రాబోయే 24 గంటలలో పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు, అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. అల్లూరి జిల్లా, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్ర తీరం వెంట 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.