Home Page SliderTelangana

‘టిల్లుస్క్వేర్’ మూవీ సక్సెస్‌మీట్‌లో కనువిందు చేయనున్న స్టార్ హీరో

Share with

‘డీజే టిల్లు’తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యువ నటుడు సిద్దూ, మరోసారి ‘టిల్లూస్క్వేర్‌’తో వినోదాన్ని పంచాడు. అనుపమా పరమేశ్వరన్, సిద్దూ నటించిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రూ.100 కోట్ల గ్రాస్‌కు చేరువవుతోంది. దీనితో చిత్రయూనిట్ సోమవారం నాడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని భావించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు ట్వీట్ చేసింది. ఈ చిత్రాన్ని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, సిద్దూ, మరో యంగ్ హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని చూసి ఎంజాయి చేశారు.