వరద బాధితులకు సహాయానికి మరో మెగా హీరో ……!
తెలుగు రాష్ట్రాలకు సహాయం చేయడానికి ఇప్పటికే చాలా తెలుగు హీరోలు ముందుకు వచ్చారు . కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తూ, వారికి ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తుంది ప్రభుత్వం. వరద బాధితులకు అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ కదిలింది. జూనియర్ ఎన్టీఆర్, అలీ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సోనూ సూద్, అనన్య నాగళ్ల, త్రివిక్రమ్, నిర్మాతలు ఇప్పటికే భారీ విరాళాలను ప్రకటించారు. తాజాగా మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కూడా తన వంతు సహాయం చేయడం కోసం ముందుకి వచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు చెరో రూ.10 లక్షలు.మొత్తం 20 లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. “విజయవాడలో మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళం గా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా తీరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..మీ సాయి దుర్గ తేజ్” అంటూ సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.