Home Page SliderNational

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

Share with

ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సమస్య మెరిట్‌లపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది న్యాయపరమైన జోక్యం పరిధికి వెలుపల ఉందని పేర్కొంది. “ప్రభుత్వంలోని ఇతర విభాగాలు చట్టం ప్రకారం పరిశీలించాల్సిన అవసరం ఉందని జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగడంపై చట్టపరమైన అడ్డంకిని చూపాలని పిటిషనర్ సుర్జిత్ సింగ్ యాదవ్ తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. “ప్రాక్టికల్ ఇబ్బందులు ఉండవచ్చు కానీ అది వేరే విషయం. లీగల్ బార్ ఎక్కడ ఉంది?” అని కోర్టు ప్రశ్నించింది. మార్చి 21న అరెస్టు చేయబడిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ కోర్టు ద్వారా మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి పంపంచగా, తాజాగా కోర్టు మరో నాలుగు రోజులు కస్టడీని పొడిగించింది.