Home Page SliderTelangana

నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Share with

కొడంగల్: తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌ పైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుండి కాంగ్రెస్‌ను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి.. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారు. ఓటు చాలా విలువైనది. ఎన్ని కార్యక్రమాలున్నా.. ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చాను. కార్యకర్తలను కలవాలని వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు నా వెంట ఉన్నారు. ప్రచారానికి రాకున్నా గెలిపించారు. ఇక్కడికి సిమెంట్ పరిశ్రమ రాబోతోంది. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయి. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభకు.. కొడంగల్ నుండి 25 వేల మంది తరలిరావాలి. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. 5 గ్యారంటీలు ప్రకటిస్తారు అని చెప్పారు.