Home Page SliderTelangana

దేశాన్ని  కరువు దిశగా నడిపిస్తున్న ఎల్‌నినో

Share with

తెలుగు రాష్ట్రాలను ఎండలు కాల్చుకు తింటున్నాయి. జూన్ నెల సగం దాటిపోయినా ఎల్‌నినో ప్రభావంతో వానలు కానరావడం లేదు. సాధారణంగా ఈ సమయానికి తొలకరి జల్లు కురిసేది. దీనితో రైతులు ఈ పాటికే వరినారు వేస్తారు. పొలాలలో దుక్కి దున్ని రెడీగా పెట్టుకున్నా వాతావరణ శాఖ చెప్పినట్లు రుతు పవనాల జాడ లేదు. దీనితో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కేరళను ఆలస్యంగానే తాకిన నైరుతి పవనాలు తర్వాత వారానికైనా తెలుగు రాష్ట్రాలకు రావలసింది. కానీ అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్ జోయ్ తుఫాన్ తీవ్రగాలుల ప్రభావంతో వచ్చే రుతు పవనాలు వెనుకంజ వేశాయి. స్కైమేట్ అనే సంస్థ అంచనా ప్రకారం జూలై మొదటి వారం తర్వాతే దేశంలో వర్షాలు పడతాయి. ఈ ఎల్‌నినో ప్రతీ 3 సంవత్సరాలకు వస్తాయి. ఇలాంటి ఎల్‌నినో ఏర్పడినప్పుడు కరువు వచ్చే అవకాశం ఉఁది. కొన్ని రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండగా, కొన్ని రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. యూపీ, బీహార్‌లో ప్రజలు విపరీతమైన ఎండలతో అల్లాడి పోతున్నారు. వడగాల్పులతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ఎండలు.