InternationalNews Alert

5 లక్షల ఏళ్ల నాటి ఏనుగు దంతం

Share with

దాదాపు 5 లక్షల ఏళ్ల కిందటి భారీ ఏనుగుదంతం ఇజ్రాయెల్‌లో తవ్వకాల్లో బయటపడింది. ‘ఆపరేషన్ ఎలిఫెంట్’ పేరుతో రెండు వారాల పాటు జరిపిన తవ్వకాల తర్వాత జెరూసలేంకు చెందిన జీవశాస్త్రవేత్త డాక్టర్ ఈటాన్ మోర్ ఈ దంతాన్ని కనుగొన్నారు.ఇది ఎనిమిదన్నర అడుగుల పొడవు, 150 కిలోల బరువుంది. 4 లక్షల ఏళ్లకు ముందే అంతరించిపోయిన అరుదైన ఏనుగు దంతం . సాధారణంగా ఆఫ్రికాలోని అతి పెద్ద ఏనుగుల దంతం సగటున 5 ఆడుగుల పొడవు, 25 కిలోల బరువు ఉంటుంది.

దాని పక్కనే ఆ కాలంలో ఆదిమ మానవుడు జంతువులను కోసేందుకు ఉపయోగించిన రాతి వస్తువు కూడా దొరికింది. దంతం సైజును బట్టి… ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న ఏనుగుల కంటే ఆ ఏనుగులు చాలా పెద్దవై ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. సాధారణంగా తినడానికి, నిల్వ చేసుకోవడానికైనా చిన్నచిన్న జంతువులను వేటాడతారు. ఇంత పెద్ద ఏనుగును వేటాడి ఆ మాంసం నిల్వ చేయడం కష్టసాధ్యమైన పని. అదో పెద్ద సామూహిక ఉత్సవం కోసం జరిగిన వధ అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.