Andhra PradeshBreaking NewsHome Page SliderPolitics

మాచర్లలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు…

పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా వివాదం రాజుకుంది. తమ వార్డులోకి రానివ్వమంటూ వైసీపీకి చెందిన మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల పార్టీల నాయకులతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డవారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది.