సోనాలీ ఫోగట్ బయోపిక్
ప్రముఖ టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ గోవాలో అనుమానాస్పద రీతీలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె ఆఖరిగా నటించిన చిత్రం ప్రేరణ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా ప్రకటించింది. ఈ సినిమా అందరికి స్పూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా సోనాలీ ఫోగట్‌ను గుర్తుచేసుకున్న దర్మకుడు నరేశ్ ధందా..త్వరలోనే సోనాలీ ఫోగట్ బయోపిక్‌ను తెరకెక్కిస్తానని వెల్లడించారు. అమె మరణానికి కారకులు ఎవరో తెలిసిన తర్వాతనే ఈ బయోపిక్‌కి సంబంధించిన షూటింగ్ ప్రారంభిస్తానన్నారు.

