Telangana

ఎంతటి నియంతలైనా ఏదో ఒక రోజు ఇంటికి వెళ్లాల్సిందే:కేసీఆర్

Share with

కేంద్రం తెలంగాణా ప్రభుత్వాన్ని కూలగోడతామంటారా? మీకు అంత దమ్ముంటే చూసుకుందామా అని కేసీఆర్ సవాల్ చేశారు. దేశంలో కేంద్రం చేస్తున్న అన్యాయాలపై చర్చకు రెడీ అన్నారు. కేంద్రం దేశ ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం భరతమాత గుండెకు గాయం చేస్తోందన్నారు. ఎల్‌ఐసీ మాదిరిగా విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తుందన్నారు. రాష్ట్రంలో కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు ఎదుర్కొనేందుకు ఎందాకైన పోరాటం చేస్తానన్నారు. ఈ సంస్కరణలతో విద్యుత్ సిబ్బంది ఉద్యోగాలన్నీ పోతాయన్నారు. దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పాతారన్నారు. దీని కోసం ఉద్యోగులంతా సింహాల్లా పోరాడాలని సూచించారు. దుబ్బాకలో పండే పంటను సిద్దిపేటలో మాత్రమే అమ్మాలి. అలా కాకుండా కేంద్రం ఎక్కడైనా అమ్ముకోవచ్చని మాయమాటలు చెబుతుందన్నారు. ఈ మధ్య ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం నుంచి లెటర్లు వస్తున్నాయన్నారు. అయినోళ్ళకు ఆకుల్లో.. కానోళ్ళకు కంచాల్లో పెట్టడమే కేంద్రం విధానమా ? అని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడొచ్చా అన్నారు.అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు.