స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పుష్ప ……!
ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు , తాజాగా పుష్ప ప్రమోషన్స్ భాగంగా బన్నీ, రష్మికకు కొచ్చిలో గ్రాండ్ వెల్కమ్ పలికారు కేరళ ఫాన్స్ . ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ ప్లేస్‌కి వెళ్లే మధ్యలో బన్నీకి స్వాగతం చెప్తూ భారీ బ్యానర్ ఏర్పాటు చేసారు. కేరళ వెల్కమ్స్ మల్లు అర్జున్ అంటూ భారీగా బ్యానర్స్ వేశారు . కేరళ ఫాన్స్ బన్నీ ని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది పుష్ప సాంగ్స్ . కేరళలో అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో కేరళలో జరిగిన ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గత 20 సంవత్సరాలుగా కేరళ అభిమానులు చూపిస్తున్న ప్రేమకు బన్నీ థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ మొదట్లో మలయాళం లిరిక్స్ ఉంటాయన్నారు. అన్ని భాషల్లోనూ ఆ పాటలో లిరిక్స్ మళయాళంలోనే ఉంటాయి బన్నీ వెల్లడించారు. అలాగే ఆ పాట ప్రోమోని కూడా అక్కడ ప్లే చేసారు. దాంతో బన్నీ ఫాన్స్ ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేశారు .
READ MORE :నాగార్జున: అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల వివాహం 2025లో…