అరెస్ట్ చేయలేరనే ధైర్యంతోనే అలా మాట్లాడుతున్నాడా?
తెలంగాణ భాష,యాసకు పొలిటికల్ పేటేంట్ ఇస్తే ఎలా ఉంటుందంటే అచ్చు గుద్దినట్లు కేటిఆర్ లా ఉంటుంది. ఆ తర్వాత ఈటెల,రేవంత్,అర్వింద్ ఇలా ఎంత మంది ఉన్నా….ముందు కేసిఆర్, ఆయన తనయుడు కేటిఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. అలాంటి కేటిర్ సమకాలీన తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయాక కేటిఆర్ ప్రదర్శిస్తున్న అసహనం మునుపెన్నడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి బహిరంగంగా ఆయన తిట్టే తిట్లు చూస్తుంటే ఏపిలో అయితే ఈ పాటికి పాతిక కేసులు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి పంపేవాళ్లు.అయితే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.ఆల్రెడీ ఇలానే ఏపిలో జగన్‌ని జైలుకి పంపి అక్కడ పార్టీని ఖాళీ చేసుకున్నది కాంగ్రెస్ అధిష్టానం.ఇప్పుడు రేవంత్ మాటలు విని …కేటిఆర్‌ని కూడా జైలుకి పంపితే తెలంగాణలో కేటిఆర్ మరో జగన్ అవుతాడనే భయంతో పాటు తెలంగాణాలో అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందేమోనన్న భయంతో కేటిఆర్ తిట్ల దండకాన్ని భరిస్తున్నారు. ఆ ధైర్యంతో …కేటిఆర్ తనను అరెస్ట్ చేస్తే చేసుకోండి…జైలుకి పోతా అంటూ పదే పదే హెచ్చరిస్తున్నాడు. ఎటూ అరెస్ట్ చేయరనే ధైర్యంతోనే కేటిఆర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారని ఇప్పటికి గానీ కాంగ్రేశీయులకు అర్ధం కాలేదు.