Home Page SliderTelangana

కేసీఆర్ వ్యూహాలకు ప్రజామోదం: ఉగాది పంచాంగం!

Share with

తెలుగువారి తొలి పండుగ, ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం గడుతూ జరుపుకునే పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు

రాజకీయ నాయకులు సైతం పంచాగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించి, తమ జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిన్న నిర్వహించారు.

కేసీఆర్‌కు ఏం చేసినా విజయం చేకూరుతుంది.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ది కర్కాటక రాశి అని ఆయన ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని ఆయన చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ది మకర రాశి వారి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని, ఈ ఏడాది మకర రాశి వారికి మంచి ప్రభావం కనిపించబోతోంది అని అన్నారు.

ఉగాదికి కేటీఆర్ ఆకాంక్ష

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని, శాంతి, సౌభాగ్యం, మత సామరస్యంతో ప్రజలంతా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు.